
యూనివర్సిటీలో ఘనంగా చిత్రకళ ప్రదర్శన
గుంటూరు న్యూస్ వెలుగు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లలిత కళా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ కళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. లలిత కళా విభాగం అధ్యాపకులు వారి విశిష్ట వైయక్తిక అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు. విభాగం సమన్వయకర్త పి దేవ కాంత్ కళా రంగ వైభవాన్ని తెలిపేలా విద్యార్థులతో చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి, భావ ప్రకటన, స్వేచ్ఛ సహనం, సోదర భావం పెంపొందించడమే కాకుండా ప్రపంచానికి కళారంగం విశిష్టతను తెలియజేయడమే ప్రపంచ కళా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ కళాకారుడు లియోనార్డో డావెన్సీ జ్ఞాపకార్థం ఏప్రిల్ 15వ తేదీన ప్రపంచ కళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లలిత కళా విభాగం అధ్యాపకులు జాన్ రత్నబాబు,శేఖర్ బాబు,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.