ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవం

ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవం

 అచ్చంపేట, న్యూస్ వెలుగు : విశ్వ కళ్యాణ సకల చరాచర జీవ సృష్టికర్త అయినా శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవం మంగళవారం  జరుపుకొనటం ఆనవాయితీ, వివరాల్లోకెళ్తే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల్ మున్ననూర్ గ్రామంలోని శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమునందు మంగళవారం  విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలు వైభవంగా జరిగాయి ,అక్కడ కులాలకతీతంగా మతాలకతీతంగా సమస్తమైనటువంటి వారు కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తమ వంతు భక్తి భావాలను సమర్పించుకున్నారు, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్యక్రమాలు స్వామివారి అభిషేకము ఆహ్వానము, ధ్వజారోహణము, స్వామివారి అలంకరణ మహోత్సవాలు, పంచ బ్రాహ్మల పూజ, పుణ్యాహవాచనము, అష్టదిక్పాలక నవగ్రహ పూజా కార్యక్రమాలు అనంతరము స్వామివారి యొక్క పంచలోహ విగ్రహానికి పంచామృతాభిషేకాలు పూలమాలలు అలంకరణలు జరిగాయి, భక్తులు అధికంగా పాల్గొన్నారు స్త్రీలు పురుషులు భక్తి భావంతో ఎంతో పరవ శించి పోయారు , ఇన్ని సంవత్సరాలైనా కూడా మా యొక్క మున్ననూరు గ్రామంలో మేము విశ్వబ్రాహ్మణులమై ఉండి కూడా విశ్వకర్మ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించలేదు ,ఈ సంవత్సరం మాత్రమే మేము అందరి సహాయ సహకారాలతో నూతనంగా శ్రీ విశ్వకర్మ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించినాము, మాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు, మహా మంగళహారతి తర్వాత తీర్థప్రసాద వితరణ ,తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగాయి ,ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని విశ్వబ్రాహ్మణ మున్ననూరు కమిటీ అభినందించారు, ఈ కార్యక్రమంలో గుండుజు వెంకటాచారి , చంద్రకళ, నారాయణ చారి ,నరేంద్ర చారి, దామోదరాచారి ,శ్రీను చారి, రమణాచారి ,జగతాచారి ,రేణయ్య ఆచారి, సత్యనారాయణ ఆచారి, పరమేశ్ చారి, శివప్రసాద్, పర్వతాలు ,చరణ్ ,చంద్రమౌళి, కృష్ణ చారి ,లక్ష్మి దేవమ్మ, నిర్మలమ్మ, విజయ ,దేవాలయ చైర్మన్ పిట్టల సురేష్ ,దాసరి శ్రీనివాసులు రవి, రాజారాం నాయక్ ,రహీం ,తుల్జా నాయక్, సంబు వెంకటరమణ, జూలూరి సత్యనారాయణ ,సురేష్ యాదవ్, మధు, హరిలాల్ ,శంకర్, శేఖర్ , గ్రామ పెద్దలు యువత మహిళా కమిటీ దేవాలయ కమిటీ పాల్గొన్నారు, మాకు ఈ ప్రథమసారి విశ్వకర్మ మహా యజ్ఞానికి మా విశ్వబ్రాహ్మణ పౌరోహితులు అచ్చంపేట డివిజన్ విశ్వబ్రాహ్మణపౌరోహితా సంఘము అధ్యక్షులు రాగి పని సీతారామాచార్యులు , ప్రథాన కార్యదర్శి చింతోజు విజయ్ కుమార్ ఆచార్యులు, బల్మూర్ రాజు ఆచార్యులు, ఈ కార్యక్రమాలు జరుపుటకు వచ్చి నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!