ఆరోగ్యమే మహాభాగ్యం: డా. కె.వి.సుబ్బారెడ్డి

ఆరోగ్యమే మహాభాగ్యం: డా. కె.వి.సుబ్బారెడ్డి

శ్రామికులందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి 

   అడిషనల్ కమాండెంట్ మహబూబ్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని

ప్రముఖ విద్యావేత్త ,కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి అన్నారు. కష్టపడి పనిచేసే శ్రామికులందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఏపీ ఎస్పీ ఇన్చార్జి కమాండెంట్ మహబూబ్ బాషా కోరారు. బుధవారం కర్నూలు ఆటోనగర్ లో రాయలసీమ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో అమీలియో హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. విద్యావేత్త డాక్టర్ కేవీ. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన ఐశ్వరం లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కుటుంబం కోసం నిత్యం కష్టపడే కార్మికులు, శ్రామికులు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ,ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని అడిషనల్ కమాండెంట్ మహబూబ్ బాషా కోరారు. పనిచేసే కార్మికులు ఆరోగ్యవంతంగా ఉంటేనే వారి కుటుంబం ఆనందంగా ఉంటుందన్నారు. సీనియర్ జర్నలిస్టులు టీ. విజయ్ , అబ్దుల్ సత్తార్ పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ ప్రెసిడెంట్ ఎస్.ఎం .ఖాద్రి సాహెబ్, అమీలియో హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ ప్రసన్న, డాక్టర్ రమాదేవి, మేనేజర్ వరప్రసాద్ లతోపాటు 2డి ఎకో టెక్నీషియన్ కళ్యాణి తదితర టెక్నికల్ సిబ్బంది, పలువురు మెకానిక్ లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!