భారీ వర్షాలు 23 మంది మృతి : సీఎం
Kerala (కేరళ ) : మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వాయనాడ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో 23 మంది మరణించారని వందలాది మంది చిక్కుకున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయివిజయన్ తెలిపారు. సంఘంట ప్రాంతంవలో సహాయక చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మృతుల బంధువులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. “వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన ప్రతి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు . గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. అధికారిక ఉత్తర్వులను PMO కార్యాలయం వెల్లడించింది.
Was this helpful?
Thanks for your feedback!