యాజమాన్య పద్ధతులు సకాలంలో పాటిస్తే  అధిక దిగుబడులు సాధించవచ్చు

యాజమాన్య పద్ధతులు సకాలంలో పాటిస్తే  అధిక దిగుబడులు సాధించవచ్చు

ముద్దనూరు, న్యూస్ వెలుగు;  మండలం రబీ సీజన్ లో మినుము,శనగ,పంట లు సాగు చేసే రైతులు ఆయా పంటల్లో రకాల ఎంపిక,విత్తన మోతాదు,విత్తన శుద్ధి, కలుపు నివారణ మరియు చీడ పీడల యాజమాన్య పద్ధతులు సకాలంలో సస్య రక్షణ చర్యలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చును అని మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.రబీ లో సాగు చేసే వివిధ పంటల్లో రైతులు పాటించవలసిన మెలకువలు గురించి సూచించారు.
మినుము పంట లో రకాలు :-యల్.బి.జి.752, టి.బి.జి.104,పి.యు.31, టి.9
ఈ రకాలు మినుము పంట లో పల్లాకు తెగులును తట్టుకొని మంచి దిగుబడులు పొందుటకు రైతులకు అనువైన రకాలు అని తెలిపారు. శనగ పంట లో రైతులకు అనువైన రకాలు.జె.జి.11( జబల్ పూర్ గ్రామ్), (రైతులు విస్తృతంగా సాగు చేసేరకం)*కె.ఏ.కె. – 2 ( కాబూలీ రకం)*యన్.బి.ఈ.జి.452 (నంద్యాల రకం) మిషన్(యంత్రం) కోత కు అనువైన రకం.*యన్.బి.ఈ.జి.47 (నంద్యాల రకం),మిషన్(యంత్రం) కోత కు అనువైన రకం.*జె.ఏ.కె.ఐ.9218 (జాకి)రకంవిత్తన మోతాదు*మినుము పంట సాగు చేయుటకు విత్తన మోతాదు ఎకరాకు 8 నుండి 10 కిలోలు విత్తనం సరిపోతుంది.*శనగ పంట సాగు చేయుటకు విత్తన మోతాదు మధ్యస్థ లావు గింజ రకాలు జె.జి.11,JAKI.9218 ,యన్.బి.జి. 1 యన్.బి.జి.49 రకాలు ఎకరానికి 30 నుండి 35 కిలోలు సరిపోతాయి.లావు గింజ రకాలు కె.ఏ.కె. 2, యల్.బి.ఈ.జి.7, రకాలు ఎకరానికి 45 నుండి 50 కిలోలు సరిపోతాయి.విత్తన శుద్ధి
విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 10 గ్రాములు ట్రెయికోడెర్మా విరిడితో గాని లేదా 3 గ్రాములు థైరమ్, లేదా కాప్టన్ లేదా కార్బెండిజం 2.5 గ్రాములు విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయటం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చును .కలుపు నివారణ విత్తనం విత్తిన 24 గంటల లోపు పెండి మిథాలిన్ 30 % అనే మందును 1 లేదా 1.5 లీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే కలుపు లేకుండా నివారించవచ్చును.చీడ పీడల యాజమాన్యం చీడ పీడలు సోకకుండా ముందు జాగ్రత్తగా ప్రతి సంవత్సరం పంట మార్పిడి పద్దతి అవలంభించాలి.వేసవి లో లోతు దుక్కులు చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.మినుము లో ముఖ్యంగా ఆశించే చీడ పీడలు మరియు నివారణ చర్యలు.కాండపు తొలిచే ఈగ
ఈ పురుగు క్రిమి దశ కాండంలో చేరి తినటం వలన మొక్క ఎండిపోతుంది.ఎక్కువగా తొలకరి పైరు పై ఆశిస్తుంది.

నివారణ
మోనో క్రోటో ఫాస్ 1.6 యమ్.యల్. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథియెటు 2 యమ్.యల్ కలిపి పిచికారి చేయాలి.

మారుకా మచ్చల పురుగు
ఈ పురుగు మొగ్గ, పూత, పిందె, దశలో ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తుంది .పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలను రంద్రం చేసి లోపలి గింజలు తినడం వలన పంట ఎక్కువగా నష్టం కలుగుతుంది.

నివారణ చర్యలు
పైరు పూత దశకు రాకముందే జాగ్రత్త చర్యలు పాటించాలి. పూత దశలో పైరుపై 5 శాతం వేప గింజల కషాయము లేదా వేప నూనె 5 యమ్.యల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొగ్గ పూత దశలో అక్కడక్కడ కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయోమో అని పరిశీలించాలి .పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిపైరిపాస్ 2.5 ml లేదా తయోడి కార్బ్ 1 గ్రామ్ లేదా ఎసిపేట్ 1 గ్రామ్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పురుగు ఉధృతి అధికంగా కనిపించినప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రామ్స్ లేదా రైనాక్స్ పిర్ 0.3 యమ్.యల్.లేదా ఫ్లూ బెండి ఏ మైడ్ 0.2 యమ్.యల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పల్లాకు తెగులు
తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి.లేదా ఏరి వేసి కాల్చి వేయాలి.
పల్లాకు తెగులు జెమిని వైరస్ వలన కలుగుతుంది . ఈ తెగులు సోకిన మొక్కల్లోని ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగు మచ్చలు కనబడతాయి .అందువల్ల దీనికి మొజాయిక్ అనే పేరు వచ్చింది.
పొలంలో ఎక్కువగా రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది.

నివారణ చర్యలు.
పల్లాకు తెగులు తట్టుకునే రకాలను రైతులు సాగు చేసుకోవాలి.
తెల్ల దోమ నివారణకు ఎకరం పొలములో 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను పంట కు ఒక అడుగు ఎత్తులో కర్ర కు పెట్టుకుంటే పురుగు ఉదృతిని గమనించి నివారణ చర్యలు చేపట్టాలి.
తెల్ల దోమ నివారణకు ట్రైజోపాస్ 1.5 యమ్ .యల్. ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా ప్రోపినో ఫాస్ 1.5 యమ్.యల్.లేదా మోనోక్రోటోపాస్ 1.6 యమ్.యల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

శనగ పంట లో చీడ పీడల యాజమాన్యం.

శనగ పచ్చ (రబ్బరు)పురుగు

ఈ పురుగు ను సకాలంలో గుర్తించి తగు నివారణ చర్యలు పాటించాలి.లేకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి.

నివారణ
మోనోక్రోటోపాస్ 1.5 యమ్.యల్ (లేదా) ఎసిఫేట్ 1 గ్రామ్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పురుగు ఉధృతి అధికంగా ఉన్నపుడు ఇండాక్సా కార్బ్ 200 యమ్.యల్.లేదా రైనాక్సి ఫిర్ 40 యమ్.యల్. లేదా తయోడికార్బ్ 300 గ్రాములు ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

వేరు కుళ్లు తెగులు
ఈ తెగులు ఎక్కువగా బెట్ట పరిస్థితుల్లో కనిపిస్తుంది. పూత మరియు కాయ దశల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

నివారణ చర్యలు
పంట మార్పిడి ఉత్తమం
తెగులు తట్టుకునే రకాలు ఎంపిక చేసుకోవాలి.
ట్రైకోడెర్మా విరిడి ద్రావణంను పిచికారి చేసుకోవాలి.
హెక్సాకొన జోల్ మందును 2 యమ్ యల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఎండు తెగులు
ఈ తెగులు ఆశించిన మొక్కలు కాడలు వాడి పోయి ,ముడుచుకొని చనిపోతాయి.
నివారణ చర్యలు
ఎండు తెగులు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.
పంట మార్పిడి చేసుకుంటే ఉత్తమం.
ట్రైకోడెర్మా విరిడి అనే మందు 10 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

సస్య రక్షణ చర్యలు
సేంద్రియ పద్ధతులను పాటించాలి.
లింగా కర్షణ బుట్టలు ఎకరానికి 6 చొప్పున పెట్టుకోవాలి.
ఎకరం పొలములో 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.
తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.
వేప నూనె మందును విరివిగా వాడుకోవాలి.

Author

Was this helpful?

Thanks for your feedback!