
ముగిసిన హోళీ వేడుకలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం స్థానిక శ్రీ ఉరవకొండ మహస్వామి మఠం వద్ద హోళీ వేడుకలు ఘనంగా ముగిశాయి.గత 7 రోజుల పాటు
యువకులు,పెద్దలు వివిధ హాస్య సన్నివేశాలను వేసి ప్రజలను కడుపుబ్బ నవ్వించారు.శనివారం హోళీ వేడుకలు చివరి రోజుల్లో భాగంగా కామన్న శవం ఊరేగింపు,కామన్నకు మరల పునర్జన్మ రావడంతో పెళ్లి కొడుకు…పెళ్లి కూతురు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.ఇందుల్లో భాగంగా యువకులు,పెద్దలు అనే తేడా లేకుండా ఆందోత్సవంలో రంగులు పూసుకుంటు కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించారు.అలాగే ఈ సందర్భంగా అక్కడి ప్రజలు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మరియు వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!