హోళగుంద,న్యూస్ వెలుగు:

మండల పరిధిలోని గేజ్జహళ్లి గ్రామంలో వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది.వివరాలోకెళ్తే శుక్రవారం గ్రామంలో ఇంటిలో హోటల్ నిర్వహిస్తూ జీవనం చేస్తున్నారు.అయితే శుక్రవారం ఉదయం ఆకస్మికంగా గ్యాస్ నుండి మంటలు చెలరేగాయి.దీంతో ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఇంట్లో ఉన్న సామాగ్రిలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.అయితే సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.మరియు రూ.50 వేలు ఆస్తి నష్టం వాటిల్లింది
Thanks for your feedback!