మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: ఉప ముఖ్యమంత్రి

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: ఉప ముఖ్యమంత్రి

మంగళగిరి న్యూస్ వెలుగు : ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.

‘ప్రజా ధనం నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ప్రతిఫలం ఉండాలి. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి పనిచేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. అప్పటి ప్రభుత్వం ఓ ప్రణాళిక లేకుండా, సొంత ప్రాపకాల కోసం ఇష్టానుసారం చేసిన ఖర్చులతో నిధులు అక్కరకు రాకుండా పోయాయ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పోలవరం డయా ఫ్రం వాల్ ను గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు మార్చి, రివర్స్ టెండర్లు అంటూ ఇష్టానుసారం నిర్మించడంతో ఎందుకు పనికిరాకుండా పోయిందనీ ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. అలాగే ఉప్పాడలో నిర్మించిన మత్స్యకారుల జెట్టీ కూడా డిజైన్ల లోపం కారణంగా పనికిరాకుండా పోయింది, దానికి మళ్లీ రూ.80 కోట్లు ఖర్చయ్యే పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పారు. చేసిన పనికే ప్రజాధనాన్ని మళ్లీమళ్లీ ఖర్చు చేసేలా అప్పటి పాలకులు పని చేశారని వివరించారు. ఉప్పాడ మత్స్యకారులతో- 100 రోజుల ప్రణాళిక అమలు, భవిష్యత్తు కార్యాచరణ, ఆదాయం పెంపు అనే అంశాలపై బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తమిళనాడు, కేరళలో విజయవంతంగా అమలు అవుతున్న సముద్ర ఉత్పత్తులతో అదనపు ఆదాయం విధానాలను పరిశీలించేందుకు ఉప్పాడ నుంచి 60 మందితో ప్రత్యేక బృందాన్ని అక్కడకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపనున్నారు. సమావేశంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే యాక్షన్ ప్లాన్ ను వారి సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘మత్స్యకారులకు సమస్య వస్తే నాకు వచ్చినట్లేనని వారు అన్నారు. మా ఇంట్లోని వారికి సమస్య వచ్చినట్లే భావిస్తానన్నారు. అదే భావనతో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ విషయాన్ని అక్టోబరు 9వ తేదీన ఉప్పాడ సెంటర్ నుంచి చెప్పాను. ఇప్పుడు అదే మాట మీద ఉన్నానన్నారు. సమస్య వస్తే రాజకీయాలకు అతీతంగా దాని పరిష్కారానికి ముందుకు వెళ్లేవాడిని. నాకు మీ సహకారం కావాలన్నారు. నన్ను శకించకండి.. నేను మీ వాడిని. మిగతా పార్టీల నాయకుల్లా సమస్య వస్తే బూతులు తిట్టడం, గొడవలు పెట్టడం తెలియదన్నారు. పరిష్కారం వచ్చేలా పని చేస్తామన్నారు.

సముద్రపు కాలుష్యం చాలా రకాలుగా ఉంటుందని, మత్స్యకారులు ఉప్పాడ తీరంలో కాలుష్య సమస్య నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దీని మూలాలను శాస్త్రీయంగా వెతికేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిపారు. ఇప్పుడు డాక్టర్ జో కిజాకూడన్ బృందం రంగంలోకి దిగి ఉప్పాడ తీరంలో కాలుష్య సమస్యపై పూర్తిస్థాయి అధ్యయనం చేస్తుందన్నారు. దీని మూలాలు వెతికి, శాశ్వత పరిష్కారం వెతుకుదామన్నారు. మత్స్యకారులకు ఎలాంటి సమస్యా రాకుండా చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటానని వారికీ భరోసా ఇచ్చారు.  పరిశోధన బృందానికి మత్స్యకారులు తగిన విధంగా సహకరించాలని, వారు తీర ప్రాంతంలో అంతా తిరిగి, సముద్రంలోకి వెళ్లి మరీ కాలుష్యానికి అసలు కారణాలను తెలుసుకుంటారన్నారు.

సమస్యను మర్చిపోలేదు

అక్టోబరు 9వ తేదీన ఉప్పాడ వేదికగా 100 రోజులు గడువు ఇవ్వాలని మత్స్యకారులను కోరాను. అప్పటి నుంచి నాతోపాటు నా కార్యాలయ అధికారులు దీనిపై కూలంకషంగా పని చేస్తున్నారు. సమస్య పరిష్కార దిశగా, మత్స్యకారులకు కొత్త భరోసా ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సమస్యను నేనెప్పుడూ మర్చిపోలేదు. మత్స్యకారులు మారుతున్న కాలంతో మరింత వేగంగా వారి బతుకులను బంగారుమయం చేసుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు అవుతున్న పద్ధతులను అవలంబింస్తామన్నారు. దీనికోసం ఉప్పాడ మత్స్యకారుల నుంచి ప్రత్యేకంగా బృందాలను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపుతున్నట్లు తెలిపారు. అక్కడి విధానాలను అవగతం చేసుకోవాలని, దానికి ప్రభుత్వం కూడా మీకు తగిన విధంగా సహకరిస్తుందన్నారు. ఉప్పాడలోని 7200 మంది మత్స్యకారులు, 25,600 మంది వారి కుటుంబ సభ్యులకు జీవన భృతి రెట్టింపు అవ్వాలి అన్నదే లక్ష్యం’’ అన్నారు.

ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, సెంట్రల్ మెరైన్ ఫిషరీష్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ కు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రిన్సిపల్ సెంటిస్ట్ డాక్టర్ జో కిజాకుడాన్, ఫిషరీష్ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, మెరైన్ షిఫరీష్ జాయింట్ డైరెక్టర్ సురేష్, కాకినాడ జిల్లా ఫిషరీష్ అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS