రాంపల్లి గ్రామంలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామంలో చాలా రోజుల నుండి తిష్ట వేసిన గ్రామ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.రాంపల్లి గ్రామంలోని ప్రధాన రహదారికు సరైన కాలువలు లేక రోడ్డుపైనే మురుగు నీరు ప్రవహిస్తుందని వారు తెలియజేశారు.దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రధాన రహదారికు కాలువలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ నాయకులు గ్రామ మహిళలతో పాటుగా వెళ్లి శుక్రవారం రోజున రాంపల్లి గ్రామ విఆర్ఓ రాజేశ్వరి కు వినతి పత్రాన్ని అందజేశారు.అదేవిధంగా రాంపల్లి గ్రామంలో గల వివిధ సమస్యలను కూడా పరిష్కరించాలని వారు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో రాంపల్లి సిపిఐ నాయకులు రామిరెడ్డి, వినోద్,చిరంజీవి,సుంకన్న, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!