బోయరేవుల గ్రామంలో మురుగునీరు, దోమలతో ప్రజలు ఇక్కట్లు

బోయరేవుల గ్రామంలో మురుగునీరు, దోమలతో ప్రజలు ఇక్కట్లు

మా గ్రామం వైపు కూడా చూడండి సారూ…!

నంద్యాల, న్యూస్ వెలుగు : వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలోని శివాలయం వీధిలో డ్రైనేజీ కాలువలు లేక మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో ప్రజలు కాలినడకన వెళ్లేందుకు కూడా వీలులేకుండా రోడ్డు అధ్వాన్నంగా తయారైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి వల్ల దోమలకు ఆవాసంగా మారి మలేరియా, డెంగ్యూ, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమల బెడద, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి గ్రామాన్ని సందర్శించి పారిశుధ్యం పై చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS