
రాజు గురువాయ పల్లె గ్రామంలో పొలము పిలుస్తోంది కార్యక్రమం
పంటల బీమా చేసుకోవాలి.ఎడి ఏ వి.వెంకట సుబ్బయ్య
మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలంలోని రాజు గురువాయ పల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఎడి ఏ వి.వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎడి ఏ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ శనగ పంట లో వేరు కుళ్లు తెగులు రాకుండా తగు నివారణ చర్యలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ వేరు కుళ్లు తెగులు సాగు చేసిన పంటలో అక్కడక్కడ కనిపిస్తుంది అని తెలిపారు .దీని నివారణకు గాను హెక్సా కోనజోల్ అనే మందును 2 యమ్. యల్.ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని కోరారు.అలాగే రైతులు రభి సీజన్ లో సాగు చేసిన ఆయా పంటలకు పంట బీమా చెల్లించాలి అని తెలిపారు.ప్రతి రైతు సాగు చేసిన పంటలకు మాత్రమే పంట బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లించాలి.పంట సాగు చేయకుండా పంట బీమా చెల్లిస్తే ప్రీమియం డబ్బులు నష్ట పోతారని రైతులకు సూచించారు.రైతులు పంట బీమా ప్రీమియం వివరాలు గురించి ఆర్ యస్ కె సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.ప్రతి రైతు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేవారు తప్పనిసరిగా బ్యాంకు లోనే ప్రీమియం డబ్బులు చెల్లించాలని కోరారు.ఒక వేళ రైతులు రుణాలు తీసుకోకుండా ఉన్న నాన్ లోని రైతులు బయట కామన్ సర్వీస్ సెంటర్ లో గాని సచివాలయంలో గాని సంప్రదించి ప్రీమియం డబ్బులు చెల్లించాలి అని సూచించారు. ప్రతి రైతు పంట బీమా చేసుకొని ధీమా గా ఉండాలి అని తెలిపారు.అనంతరం రైతులతో గ్రామ సభ నిర్వహించి శనగ పంట సాగులో పలు సూచనలు సలహాలు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ యమ్ పి ఈ ఓ యమ్.జ్యోతి,గ్రామ నాయకులు ఆర్.శివ శంకర రెడ్డి, చింతా మధు సాగర్ రెడ్డి,శివరామిరెడ్డి, సాయి నాథ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లు రైతులు పాల్గొన్నారు.