న్యూస్ వెలుగు ఢిల్లీ :

భారత్ , పాకిస్తాన్ మధ్య రాబోయే సంఘర్షణను తాను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను భారతదేశం తిప్పికొట్టింది. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య జరిగిన చర్చలలో వాణిజ్యం గురించి ప్రస్తావన లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా మే 8 మరియు 10 తేదీలలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌తో మరియు మే 10న NSA అజిత్ దోవల్‌తో మాట్లాడారని వర్గాలు తెలిపాయి. ఈ చర్చలలో దేనిలోనూ వాణిజ్యం గురించి ప్రస్తావన లేదని వెల్లడించారు.
Thanks for your feedback!