ఇంగలదహల్ పాఠశాల కాంప్లెక్స్ ను యథావిధిగా కొనసాగించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండలంలోని ఇంగలదహల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీటీసీ మల్లికార్జున,సర్పంచ్ లు ఇంగలదహల్ ప్రమీదవతమ్మ,ఎం.డి.హళ్లి సుధాకర్,పెద్ద గోనెహాల్ వెంకటరామిరెడ్డి,మాజీ ఎంపీటీసీ సర్పంచ్ చంద్రన్న గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆ నాడు పాఠశాల ఏర్పాటు చేసినప్పుడే పాఠశాలకు కాంప్లెక్స్ ను ఇవ్వడం జరిగిందని,కానీ గత కొన్ని రోజుల క్రితం స్కూల్ కాంప్లెక్స్ రి ఆర్గనైజింగ్ పేరుతో ఉన్న కాంప్లెక్స్ ను తొలగించడం జరిగింది.మరియు తొలగించడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.ఇంగలదహల్ పాఠశాల 1964లో ఏర్పాటు చేశారు.అదేవిధంగా సువిశాల మైన 7.65 ఎకరాల స్థలం అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యం,బాలుర వసతి గృహం,పాఠశాలలో అదనపు తరగతి గదులు అన్ని వసతులు ఉన్న పాఠశాల కాంప్లెక్స్ ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం దారుణం అన్నారు.కావున కాంప్లెక్స్ ను యథావిధిగా కొనసాగించాలని సోమవారం తహసీల్దార్,ఎంపీడీఓ, ఎంఈఓలకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీకాంత్ రెడ్డి,చంద్రకాంత్ రెడ్డి,వెంకటరామిరెడ్డి యూత్ అసోసియేషన్ సభ్యులు రఫీ,రాజు,శేఖర్,మల్లికార్జున బాబు పంపాపతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.