
పి.రుద్రవరంలో… ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు మండలం పి. రుద్రవరం గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలో యోగా దినోత్సవం నిర్వహించారు. సచివాలయం సెక్రటరీ, సిబ్బంది, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మహిళలు చిన్నారులు కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో యోగా దినోత్సవం పై ర్యాలీ నిర్వహించారు. యోగా పై అవగాహన కల్పించారు. యోగా దినోత్సవం పురస్కరించుకొని సచివాలయం సెక్రటరీ మాట్లాడుతూ యోగా అనేది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి ఒక సాధనం అని, చిన్ననాటి నుంచి యోగా అభ్యాసం చేస్తే రోగాల నుంచి బయటపడవచ్చని, అదే విధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె.తిలక్ మోహన్, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!