గైనిక్ విభాగంలో సిటీజి ఫీటల్ మానిటర్స్  ఓటి టేబుల్ ప్రారంభం

గైనిక్ విభాగంలో సిటీజి ఫీటల్ మానిటర్స్  ఓటి టేబుల్ ప్రారంభం

కర్నూలు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు కృష్ణా రెడ్డి, అరుణ దంపతులు తమ మాతృమూర్తి పెన్నబడి గంగులమ్మ జ్ఞాపకార్థం 30 లక్షల విలువైన వివిధ ఎక్విప్మెంట్స్  వితరణ 

కర్నూలు, న్యూస్ వెలుగు;  ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అమెరికా లోని చికాగో లో నివసించే 1962,1963 బ్యాచ్ కు చెందిన కర్నూలు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు కృష్ణా రెడ్డి, అరుణ దంపతులు తమ మాతృమూర్తి పెన్నబడి గంగులమ్మ జ్ఞాపకార్థం 30 లక్షల విలువైన వివిధ ఎక్విప్మెంట్స్ ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కర్నూలుకు విరాళంగా ఇచ్చారు.. అందులో భాగంగా మంగళవారం  గైనిక్ డిపార్ట్మెంట్లో విలువైన వైద్య పరికరాలు BT -350 సిటీజి మానిటర్స్ -2 , ఓటి టేబుల్-1 లను మంగళవారం  గైనిక్ డిపార్ట్మెంట్ లో ప్రారంభించినట్లు తెలియజేశారు. ఆసుపత్రిలో సిటీజి మానిటర్స్ ద్వారా గర్భవతులకు కాన్పు సమయంలో శిశువు గుండె పనితీరు, గుండె రేటును కంటిన్యూ గా మానిటరింగ్ చేయడం వలన హైరిస్క్ కేసస్ లో డెలివరీ కి ఉపయోగించి మోర్టాలిటీ రేటు తగ్గించడానికి ఈ వైద్య పరికరం చాలా ఉపయోగపడనున్నట్లు తెలియజేశారు. ఓటీ టేబుల్ ద్వారా లాపరోస్కోపి చేసేటపుడు వివిధ పొజిషన్ లకు ఉపయోగించడం వలన పేషెంట్ కు సంబంధించిన క్లిష్టమైన కేసులు చేయడానికి మాడరన్ ఒటి టేబుల్ చాలా ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. త్వరలో ఇన్ఫెర్టిలిటీ విభాగం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు  ఇన్పెర్టిలిటి క్లినిక్ లో భాగంగా లాప్రోస్కోపీ  ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి అల్ట్రా సౌండ్ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.త్వరలో ఆన్ టేబుల్ అల్ట్రాసౌండ్ మిషన్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు.  గైనిక్ విభాగానికి అత్యాధునిక వైద్య పరికరాలు అందజేసిన ఆసుపత్రి సూపరిండెంట్  గైనిక్ విభాగపు వైద్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గైనిక్ విభాగపు Hod, డా.శ్రీ లక్ష్మి, గైనిక్ విభాగపు వైద్యులు, డా.సావిత్రి, డా.శ్రీలత, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ, డా.హేమనలిని, డిప్యూటీ సివిల్ సర్జన్, డా.వెంకటరమణ, గైనిక్ విభాగపు వైద్యులు, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి  తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!