సీఎం చంద్రబాబు నాయుడు కి ఆహ్వానపత్రిక

సీఎం చంద్రబాబు నాయుడు కి ఆహ్వానపత్రిక

ఇంద్రకీలాద్రి, న్యూస్ వెలుగు;  శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై తేది. 06.03.2026 నుండి 08.03.2026 వరకు జరుగబోయే కుంభాభిషేక కార్యక్రమం ఆహ్వానంను  మంగళవారం  మధ్యాహ్నం రాష్ట్రముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వారికి దేవదాయ, దేవస్థానం యంత్రాంగం అందజేశారు.రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ ముఖ్య మంత్రి కి కుంభాభిషేక ఆహ్వానం అందజేశారు. ఆలయ స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్, వేద పండితులు, అర్చకులు ముఖ్యమంత్రి కు వేద ఆశీస్సులు అందజేసి, శ్రీ అమ్మవారి ప్రసాదం అందజేయగా, శ్రీ అమ్మవారి చిత్ర పటంను దేవదాయ శాఖ కమిషనర్, ఆలయం చైర్మన్, కార్యనిర్వాహణాధికారి అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS