
పత్తికొండ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి
ఎడమ కాలను పొడిగించి చిన్న హుల్తి పెద్ద హుల్తి దేవనబండ జూటూరు నలకదొడ్డి గ్రామాల మీద వెంగలయ దొడ్డి వరకు పంట పొలాలకు సాగునీరు అందించాలి…..డి.రాజా సాహెబ్
పత్తికొండ, న్యూస్ వెలుగు : పందికొన రిజర్వాయర్ కింద ఉన్న ఎడమ కాలమును ముందుకు పొడిగించాలని శుక్రవారం రోజు పత్తికొండ తహశీల్దార్ కి వినతిపత్రం ఇస్తున్న సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజవర్గ కార్యదర్శి బి సురేంద్ర కుమార్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు గురుదాస్ కారన్న కారుమంచి తో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం డి.రాజా సాహెబ్. బి.సురేంద్ర కూమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పడమటి ప్రాంతం ఆయన పత్తికొండ నియోజకవర్గం గత అనేక సంవత్సరాల నుండి కరువు, కాటకాలుకు గురై పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అయితే ఆ సందర్భం లోనే కృష్ణా జలాలు రాయలసీమకు పత్తికొండ ప్రాంతానికి మళ్ళించాలని , ఎడారిగా మారుతున్న పత్తికొండ ప్రాంతానికి పంట భూములకు సాగునీరు , త్రాగునీరు ఇవ్వాలని గ్రామ గ్రామాన ప్రజలను, రైతులను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చైతన్యవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం గత 40
సంవత్సరాలగా ఆందోళనలు చేస్తే ప్రభుత్వం స్పందించి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి హంద్రీనీవా కాలువ ద్వారా పత్తికొండ మండలంలోని పందికోన కొత్తపల్లి గ్రామాల మధ్యలో రిజర్వాయర్ నిర్మించారు . ఆ రిజర్వాయర్ నుండి కుడి కాలువ ద్వారా దేవనకొండ మండలంలోని దాదాపు 45 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వము రూపకల్పన చేసింది. పందికొన రిజర్వాయర్ కింద ఎడమ కాలువ ద్వారా పత్తికొండ నియోజకవర్గం లోని కేవలం 15 వేల ఎకరాలకే నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది . అయితే మండలంలో చాలా గ్రామాలు పంట భూములకు సాగునీరు వస్తాయని కొన్ని సంవత్సరాల నుండి ఎదురుచూసిన రైతులకు నీళ్లు రావు అని నిరాశ చెందినారు. గత మూడు నెలల క్రిందట గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామ పర్యటన సందర్భంగా పుచ్చకాయల మాడ గ్రామానికి పంట భూములకు హంద్రీనీవా నీళ్లు ఇస్తానని చెప్పడం శుభపరిణామమే .అయితే నేటి వరకు కార్యరూపం దాల్చలేదు. మండలంలోని మిగిలిన గ్రామాలలో కూడా రైతులు పెట్టిన పెట్టుబడి చేతికి రాక కరువుకు గురై అప్పలపాలై రైతులు కరువు కోరాల్లో కురుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో ఎడమ కాలువ పెద్దహుల్తి గ్రామం దగ్గర ఆగిపోవడం జరిగింది. ఈ ఎడమ కాలువ ఆగిన దగ్గర నుండి హోసూరు గ్రామ పొలాలు మీదుగా తిరిగి యూటర్న్ తీసుకొని చిన్న హుల్తి, దేవనబండ గ్రామాల మధ్యలో జూటూరు, అటీకలగుండు, నలగదొడ్డి గ్రామాల మీదుగా ఆస్పరి మండలం బిల్దేకల్, వెంగలాయి దొడ్డి చెరువు వరకు ఎడమ కాలువ నిర్మాణం చేస్తే వేలాది ఎకరాల పంట భూములకు సాగునీరు ఇచ్చెదనికి అవకాశం ఉంది. అలాగే దాదాపు పది గ్రామాల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది. ఈ కాలువ అతి తక్కువ ఖర్చుతో నిర్మాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
సంబంధిత శాఖ జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఈ ఎడమ కాలువను పొడిగించి ఆయా గ్రామాల ప్రజలకు, రైతులకు సాగునీరు, తాగునీరు అందించవలసిందిగా కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం(AIKS) తరపున తమరికి తేదీ: 16 -01 -2025 న వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారురైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు సిద్దు.పెద్ద ముని.ఎఐటియుసి తాలుకా అద్యక్షులు నెటికంఠయ్య ఎఐవైఎఫ్ మండల అధ్యక్షకార్యదర్శ ఉపేంద్ర అనేమేష్ .జోలాపురం కాశీ. నాగిరెడ్డి అనుమంతు . తదితరులు పాల్గొన్నారు