ప్రశాంతంగా ముగిసిన  సాగునీటి సంఘం ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన సాగునీటి సంఘం ఎన్నికలు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో అధికారులు పోలీసుల సమక్షంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినవి. బొంది మడుగుల గ్రామ సాగునీటి సంఘం అధ్యక్షుడిగా తుగ్గలి మండలం లోని నునుసు రాళ్ళ గ్రామానికి చెందిన దూదేకొండ రామాంజీ నేయులు ఏక గ్రీవంగా ఎన్నికవడం జరిగింది.అదే విధంగా ఉపాధ్యక్షులుగా నునుసు రాళ్ళ గ్రామానికి చెందిన మద్దిలేటి కూడా ఏక గ్రీవంగ ఎన్నిక కావడం జరిగింది.అదే విధంగా చెన్నంపల్లి గ్రామ సాగునీటి సంఘం అధ్యక్షులుగా సప్లయర్ హెచ్.గోపాల్ రెడ్డి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. పగిడి రాయి గ్రామానికి చెందిన సాగునీటి సంఘం అధ్యక్షుడిగా విష్ణు వర్ధన్ రెడ్డి కూడా ఏక గ్రివంగా ఎన్నీకవడం జరిగింది.బొంది మడుగుల సాగునీటి సంఘం ఎన్నికల టీ.సి సభ్యులు రమణా రెడ్డి. మల్లి కార్జున.అనిల్ కుమార్.ఉసేన్ ఆరుమంది టీసీలుగా ఉన్నారు. ఈ సాగునీటి సంఘం ఎన్నికలలో బొంది మడుగుల గ్రామ సర్పంచ్ సలహా దారులు ఎస్.ప్రతాప్ యాదవ్.మండల అధ్యక్షులు రాంపల్లి ఆర్. తిరుపాలు నాయుడు.నునుసు రాళ్ళ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి. నల్లగుండ్ల కుశినేని రవి కుమార్.మరియు చెన్నంపల్లి గ్రామ సాగునీటి సంఘం ఎన్నికల కార్యక్రమంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు కొత్తపల్లి గుడిసెల వేంకటపతి.నబీ రసూల్.షేక్.మబాషా.
సత్తార్ వలి.కోటేశ్వర గౌడ్.అక్బర్ బాషా. షాషావలి మరియు సాగునీటి సంఘం ఎన్నికల అధికారులు శ్రీహరి.వెంకట రాముడు.మనోహర్.భార్గవ్.దాదా కలెండర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!