రహదారిలో ప్రమాదం జరిగిన బాధితులకు సహాయం చేయడం మనందరి బాధ్యత

రహదారిలో ప్రమాదం జరిగిన బాధితులకు సహాయం చేయడం మనందరి బాధ్యత

   డిటిసి ఎస్ శాంత కుమారి

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ నగరంలోని 36వ, జాతీయ రోడ్డు మాసోత్సవాలు 20వ, రోజు కొనసాగుతున్నాయి, ఈ కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంత కుమారి ఆదేశాల మేరకు, ఆర్టీవో ఎల్ భరత్ చావన్ పర్యవేక్షణలో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కే రవీంద్రబాబు, ఎం వి సుధాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో బుధవారం కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల లోనీ, పాత లెక్చలర్ గ్యాలరీలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా (గుడ్ సమారిటన్) అనే కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎంహెచ్వో డాక్టర్ శాంతి కళ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ లు హాజరయ్యారు, ఈ సందర్భంగా ( గుడ్ సమారిటన్ ) అంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసే వ్యక్తి అని అర్థం, ఈ అంశంపై డిటిసి ఎస్ శాంతకుమారి, ఆర్టీవో ఎల్ భారత్ చవాన్ లు మాట్లాడుతూ, డాక్టర్లకు హాస్పిటల్లో ఉన్న రోగుల బంధువులకు వివరించలని, కర్నూల్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్ ల డాక్టర్లకు తెలియజేశారు. అవి ఏమనగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న ఎవరైనా సరే సహాయకుడు బాధ్యతగా అంబులెన్స్ ను పిలిపించి హాస్పిటల్ కు తరలించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారి ప్రమాదాల్లో గంటకు ఒకరు, ఇద్దరు చొప్పున బలి అవుతున్నారు. రహదారి పైన ప్రమాదం జరిగినపుడు, ప్రమాద బాధితులను రక్షించడంలో మొదటి 60 నిమిషాలు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, మరియు మరణాలు తగ్గించడానికి చాలా కీలకమైనవి. రహదారి ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వారెవరైనా బాధితులకు సహాయం చేసి హాస్పిటల్ కు తీసుకువెళ్ళటానికి సంకోచిస్తారు. సహాయం చేసిన వారిని కూడా మెడికో లీగల్ కేసులో భాగంగా పోలీసులు, హాస్పిటల్ సిబ్బంది ఇబ్బంది పెడతారనే భయంతో చాలా మంది సహాయం చేయడానికి కూడా సంకోచిస్తారు. రహదారి ప్రమాదాల్లో సహాయం చేసే వారికి రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం నూతన చట్టం తెచ్చిందని వారు అన్నారు, ప్రాణాంతక రహదారి ప్రమాదాలలో, క్షతగాత్రులను గోల్డెన్ అవర్ సమయంలో ఆసుపత్రి లేదా ట్రామా కేర్ సెంటర్ కు తరలించి, తగిన చికిత్సను అందించడం ద్వారా, ప్రాణాలను కాపాడిన, ప్రాణదాతలకు, ప్రభుత్వం ద్వారా 5 వేల నగదు మరియు సర్టిఫికేట్ అందించబడుతుందనీ తెలిపారు. ఈ స్కీము అక్టోబరు 15, 2021 నుండి మార్చి 21, 2026 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎంపిక విధానం, క్షతగాత్రులను రక్షించిన ప్రాణదాత, సంఘటన వివరాలను సమీప పోలీస్ స్టేషన్లో లో తెలియపర్చాలి. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి ( సి.ఐ. లేదా ఎస్.ఐ ) ప్రాణదాత యొక్క పేరు, మొబైల్ నెంబరు, అడ్రసు ప్రమాదం జరిగిన ప్రదేశం, సమయం మరియు తేది, క్షతగాత్రుల ప్రాణాలను కాపాడిన విధానం మొదలగు వివరాలతో ప్రాణదాతకు రశీదు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా, అట్టి రశీదు కాపీని జిల్లా కలెక్టర్, కర్నూలు చైర్మన్ పరిశీలన కమిటీకి పంపబడుతుంది. ఈ కమిటీలో కర్నూలు జిల్లా పోలీస్ కమీషనర్ / జిల్లా ఎస్పీ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, జిల్లా ఉప రవాణా కమీషనర్ (సభ్య కార్యదర్శి) సభ్యులుగా ఉంటారు. ఒకవేళ ప్రాణదాత క్షతగాత్రులను నేరుగా ఆసుపత్రిలో చేర్పించి, సమయాభావం వలన సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వకపోతే, సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం పోలీస్ స్టేషను సమాచారం ఇవ్వాలి. సమాచారం అందుకున్న పోలీసు అధికారి, ప్రాణదాతకు రశీదు పంపడంతో పాటు పరిశీలన కమిటీకి రశీదు కాపీని పంపాలి. జిల్లా స్థాయి కమిటీ, ధరళాస్తును పరిశీలించి, ఆమోదించిన ధరఖాస్తులను ధరఖాస్తులను రూ. 5,000/- ల నగదు అవార్డు మరియు సర్టిఫికేట్ కొరకు రవాణా కమీషనర్, ఆంధ్రప్రదేశ్ కు పంపబడుతాయి, రవాణా కమీషనర్, ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రాణదాత అకౌంట్లో లో నేరుగా డబ్బులు ఆన్లైన్ ద్వారా జమ చేయబడతాయి, ఒకవేళ ప్రాణదాత ఒకే సమయంలో ఒకరికన్నా ఎక్కువమంది ప్రాణాలు కాపాడితే రూ॥ 5,000/- లు నగదు మాత్రమే ఇవ్వబడును. ఒకవేళ ఒకరికన్నా ఎక్కువమంది ప్రాణదాతలు, ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాపాడితే నగదు ప్రోత్సాహకం సమంగా పంచబడుతుంది. ఒకవేళ ఒకరికన్నా ఎక్కువమంది ప్రాణదాతలు ఒకరికన్నా ఎక్కువమంది క్షతగాత్రులను ఒకే ప్రమాదంలో కాపాడితే ప్రతి ఒక్క ప్రాణదాతకు గరిష్టంగా రూ.రూ.5,000/- లు బహుమతి / ప్రోత్సాహకం అందించబడుతుంది. నగదు బహుమతితో పాటు ప్రతి ప్రాణదాతకు ప్రభుత్వ అభినందన పత్రం అందజేయబడుతుందనీ డిటిసి ఎస్ శాంత కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ, పి శాంతి కళ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు, సిఎస్ఆర్ఎమ్ఓ, డాక్టర్ బి వి రావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి, రోడ్డు భద్రత వైద్యశాఖ అధికారి, డాక్టర్ జెషాన్ అహ్మద్, కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్ధిన్ ఎంవిఐ లు కే రవీంద్ర కుమార్, ఎం వి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ ఎంవిఐ లు వి బాబు కిషోర్, ఎన్ గణేష్ బాబు, ఆర్టిఏ కానిస్టేబులు, విజయ భాస్కర్, చలపతి, హోంగార్డులు, కర్నూల్ ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది, ప్రవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!