మహిళలను గౌరవించడం మన బాధ్యత

    ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

హోళగుంద, న్యూస్ వెలుగు: మహిళలను గౌరవించడం మన బాధ్యత అని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,టీడీపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,బిజెపి మండల కన్వీనర్ సుధా అన్నారు.శనివారం మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా సత్తా చాటలన్నారు.మరియు విద్య,ఉద్యోగం,రాజకీయ రంగాల్లో మహిళలు రాణించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నూర్జహాన్ బీ,వైస్ ఎంపిపి సింధువాలం గాదేమ్మ,సర్పంచ్ తనయుడు పంపాపతి,వైస్ ఎంపిపి భర్త హనుమప్ప,సచివాలయం సిబ్బంది,అంగన్వాడి కార్యకర్తలు,పొదుపు సంఘాల మహిళలు,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!