విద్యార్థుల్లో రాజకీయ అవగాహన, సేవాభావం పెరగాలి
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు; పొద్దుటూరు పట్టణంలోని డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవo సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన షిర్డిసాయి జూనియర్ కళాశాల క్రికెట్ జట్టుకు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు ఉషారాణి, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మిదేవిలు బహుమతులు ప్రధానం చేశారు. బహుమతులు ప్రధానం చేయడానికి వచ్చిన ముఖ్య అతిథి *జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తవ్వా సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల్లో విద్యార్థుల్లో చదువుతో పాటు రాజకీయ అవగాహన పెరగాలని, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని, సేవా భావం అలవర్చుకోవాలని అన్నారు. విద్యార్థులు సమాజంలో ఉన్న లోపాలను సరిచేసేందుకు పూనుకొని దేశాన్ని మరింత ఉన్నంతంగా నిలపాలని అన్నారు. కష్టంలో వారికి సేవచేయాలని అన్నారు. అనంతరం కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మిదేవి మాట్లాడుతూ
విద్యార్థులు చదువుతోపాటు క్రీడ రంగంలో కూడా ముందుండి రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. ఆటలు ఆడటం వలన విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఈ బహుమతులు ప్రధాన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శివారెడ్డి ,డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్, ఇన్నర్ వీల్ సభ్యులు పొన్ను లక్ష్మిదేవి , డివైఎఫ్ఐ నాయకులు విశ్వనాథ్, శివ, వినయ్ విద్యార్థులు పాల్గొన్నారు.