మాజీ ముఖ్యమంత్రిని కలిసిన జిట్టా నాగేష్

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన జిట్టా నాగేష్

పార్టీ విధి విధానాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లండి

* వైసీపీ నేతలకు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచన.

* తాడేపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ను కలిసిన వైసిపి నేతలు జిట్టా నగేష్ యాదవ్,నారాయణ నాయక్ లు.

తుగ్గలి న్యూస్ వెలుగు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధాలనాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్ కు, మాజీ జెడ్పిటిసి రాష్ట్ర వైసీపీ ఎస్టీ విభాగపు జోనల్ అధ్యక్షులు నారాయణ నాయక్ లకు సూచించారు.వైసీపీ అధినేత మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జిట్టా నగేష్ యాదవ్,నారాయణ నాయక్ లు కలిశారు.ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి జిట్టా నగేష్ యాదవ్ ను నారాయణ నాయక్ లను ఆప్యాయంగా పలుకరించారు.నియోజకవర్గములో రాజకీయ పరిస్థితులు,ఇటీవల నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆరా తీశారు.మన పార్టీ విధి విధానాలను నియోజకవర్గముతో పాటు జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.అలాగే అధికార పార్టీ చేస్తున్న దురాఘతాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగుడుతూ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.పార్టీ క్యాడర్ కి ఎప్పటికప్పుడు ధైర్యాన్నిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.జగన్ మోహన్ రెడ్డి తో భేటి అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో పార్టీ కార్యక్రమాలు భవిష్యత్లో మరింత చురుగ్గా సాగుతాయన్నారు.జగన్ మోహన్ రెడ్డి పర్యటనలను,అలాగే వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని వీటిని ఏమాత్రం లెక్క చేసే పరిస్థితి ఉండదన్నారు.తాము ప్రజల కోసం పని చేస్తున్నామని ప్రజలకు నష్టం కల్గించే పనులు చేస్తే పోరాటం తప్పదన్నారు. కార్యకర్తలకు చిన్న ఇబ్బంది కలిగిన అధినేత జగన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి నేరుగా స్పందిస్తున్నారన్నారు.భవిష్యత్ లో తమ పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతంగా ఉంటాయని వారు స్పష్టం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!