ప్రతి మనిషికి ఉద్యోగమే జీవిత ఆశయం…

ప్రతి మనిషికి ఉద్యోగమే జీవిత ఆశయం…

ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

161 మందికి కాను 110 మందికి నియామక పత్రాలు అందజేసిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి 
పుట్టపర్తి, న్యూస్ వెలుగు; ప్రతి మనిషికి ఉద్యోగమే జీవిత ఆశయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అమర రాజా కంపెనీ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో అమర రాజా కంపెనీ ఒకటిగా నిలిచిందన్నారు. గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల ప్రతిభను వెలికితీసి వారికి కంపెనీ లో ఉద్యోగం కల్పించి ఉపాధి చూపుతున్న కంపెనీ యాజమాన్యానికి, ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు ఈలాంటి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు కల్పించడానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు 161 మందికి కాను 110 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధి కలించాలనే ఉద్దేశ్యంతో వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సాధించారని తెలిపారు. గత ప్రభుత్వం లో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన చరిత్ర లేదన్నారు. వైసిపి అధినేత జగన్ కు నిరుద్యోగుల శాపం తగలడం వల్లే ప్రజలు శాశ్వతంగా ఇంటికి ఇప్పటికే పంపారని గుర్తు చేశారు. భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల హబ్ గా తయారవుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగాలు కలించడమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్ లో మంచి వేతనం తో పాటు ఆయా కంపెనిలో పదోన్నతి పొంది కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలని వారికి సూచించారు.పుట్టపర్తి నియోజవర్గం నుంచి జారీ గా తరలి వచ్చిన నిరుద్యోగులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. ఎంపికైన 110 మంది యువతీ యువకులకు అమర రాజా బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు కళ్యాణ్, చిట్టి బాబు, ఎపిడి కంపెనీ ప్రతినిది చంద్రశేఖర్ లు ఇచ్చిన కంపెనీ నియామక పత్రాలు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్ రామాంజనేయులు ,పుడా మాజీ చైర్మన్ సుధాకర్ నాయుడు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సామకోటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!