కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు : కొత్తూరు సత్యం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు : కొత్తూరు సత్యం

న్యూస్ వెలుగు, కర్నూలు; నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగులు నానాటికి పెరిగిపోతున్నారని , ఉద్యోగాలు లేక పక్కదారి పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి వ్యవహరించిన తీరు నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతుందని, ఎన్నికల ముందు ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగ భర్తీ చేస్తానని హామీ ఇచ్చి యువతి యువకులను నిరాశపర్చారన్నారు . గెలుపే లక్ష్యంగా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చాక యువతి యువకులను నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను నేటి తరం గుర్తించుకోవాలన్నారు. యువతీ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరకాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే రామబాణం అని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశంలో రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. మాట ఇస్తే అభివృద్ధి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలిపారు. కొన్ని పార్టీలు మాట ఇస్తే నమ్మి ఓట్లు వేస్తే యువతి యువకులను ప్రశ్నించేందుకు కూడా లేకుండా చేశారన్నారు. చదువుకున్నది ఒకటి ఉద్యోగం మరొకటి అన్న చందంగా మారిందన్నారు . ఏదో బ్రతకాలి కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటూ పోతున్న దుస్థితి ఏర్పడిందని ,దీన్ని ఫలితాలు ఉండవన్నారు. యువతీ యువకులు నిరాశ నిస్పృహతో ఉండిపోవటం వల్ల దేశం బలహీన పడుతుందని ఆయన తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగులతో కిటకిటలాడుతూ ఏమి చేయాలో దిక్కు తోచక మద్యం కు బానిసై చెడు అలవాట్లకు లోనై తప్పుడు విధానాలకు పోయి మహిళలకు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇటీవల పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అందించిన నివేదిక చూసేనా ప్రభుత్వాలు మారాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో యువతీ యువకులు నిరుద్యోగులుగా మారి ఉపాధి లేక ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల్లో పనుల కోసం వలసలకు వెళ్లడం బాధాకర విషయం అన్నారు పాలకులు ఇస్తున్న హామీలు శృతిమించి పోవడంతో ఆర్థిక భారం రేపటి తరానికి అప్పుల భారంగా మారిపోతుందన్నారు .ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని ఆర్థిక అభివృద్ధిని పెంచేందుకు ప్రయత్నించాలని పాలకులను ఆయన కోరారు. త్వరలో నిరుద్యోగులతో యువతీ యువకులతో సమావేశమై కార్యాచరణ చేపట్టబోతున్నానని అని తెలిపారు. యువతీ యువకులు దేశ అభివృద్ధికి ఉద్యోగ భద్రత పై తగిన సూచనలు ఇవ్వాలని సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!