ఆత్మ రక్షణకు కరాటే  మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగకరం 

  ఆత్మ రక్షణకు కరాటే  మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగకరం 

జిల్లాస్థాయి ఉషూ కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను అభినందించిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ 

న్యూస్ వెలుగు, కర్నూలు; బాలికల్లో ఆత్మ రక్షణ తో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని కింగ్ మార్కెట్ వద్ద ఉన్న మున్సిపల్ హైస్కూల్ పార్కులో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి ఉషు కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను షీల్డ్ లు అందజేసి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మత్తు, మాదక ద్రవ్యాల వినియోగం నేపథ్యంలో మహిళలపై అత్యాచార సంఘటనలు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఆత్మ రక్షణ కోసం వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో అవసరం అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాలికలకు సంబంధించి కరాటేలు శిక్షణను ప్రోత్సహించేందుకు తాను ముందుకు వస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు గంజాయి లాంటి మత్తు.. మాదకద్రవ్యాల వినియోగానికి ప్రభావితం అవుతున్నారని ,ఈ నేపథ్యంలోనే వారు బాలికలపై అత్యాచార ఘటనలు వంటి సంఘటన పాల్పడుతున్నారని చెప్పారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల బాలికలు తమను తాను రక్షించుకోవడంతో పాటు ప్రమాదంలో ఉన్నవారిని సైతం రక్షించే అవకాశం ఉందని చెప్పారు.
కరాటేలో శిక్షణ పొందడం వల్ల ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటి అంశాల్లో ప్రభావితమై సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని వివరించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని చెప్పారు. తాను వైద్యుడిగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం క్రీడల్లో ప్రోత్సహిస్తున్నానని వివరించారు. కర్నూల్ నగరంలో దశాబ్దాలుగా చిన్నారులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న కరాటే శిక్షకుడు టి శ్రీనివాసులును ఆయన అభినందించారు. కర్నూల్ నగరంలో క్రీడల అభివృద్ధికి నిరంతరం తన వంతు సహకారం అందజేస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!