
కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత.. ఆటో సీజ్
పుట్టపర్తి, న్యూస్ వెలుగు; కర్ణాటక అక్రమ మద్యం తీసుకువస్తున్న ఓ వ్యక్తిని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న ఐపిఎస్ ఆదేశాలతో.. అరెస్టు చేయడంతో పాటు అతను వద్దనుండి అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని ఒక ఆటోను సీజ్ చేశారు.
అమడగూరు పోలీసు సిబ్బంది తనిఖీ లో కర్ణాటక మద్యం తెస్తున్న ఒక ముద్దాయి మరియు 192 హైవర్డ్స్ చీర్స్ విస్కీ 90 ఎంఎల్, 96 ఓల్డ్ అడ్మిరల్ వియస్ఓపీ బ్రాందీ 180ఎంఎల్, 9 ఓల్డ్ అడ్మిరల్ వి.యస్.ఓ.పీ బ్రాందీ 1000ఎంఎల్ కర్ణాటక మద్యం మరియు ఒక ఆటొ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ నారాయణ తెలిపారు.
మహిళా డిఎస్పీ , ఇన్చార్జి పుట్టపర్తి డిఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఉత్తర్వుల మేరకు సిఐ నల్లమాడ సి ఐ నరేందర్ రెడ్డి ,సమాచారము మేరకు ఆమడగూరు పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఏ. వెంకటనారాయణ, స్టేషన్ సిబ్బంది హెడ్-కానిస్టేబుల్ పి. సూర్యనారాయణ, కానిస్టేబుళ్లు బీ విజయ్ కుమార్ మరియు యం. జాబివుళ్ళ ల తనిఖిలో కర్ణాటక రాష్ట్రము నుండి అక్రమంగా మద్యాన్ని ఆంధ్రా కు తరలించి ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తున్న
షేక్ బాబావలి, వయస్సు (51), తండ్రి షేక్ హుస్సేన్ సాహెబ్, డోర్ నెంబర్: 10-1098-435, ఉమర్ మసీద్ ఏరియా, నిజాంవలి కాలనీ, కదిరి పట్టణం ను ఆమడగూరు మండలం, వెంకట నారాయణపల్లి క్రాస్ దగ్గరలో అరెస్టు చేసి అతని వద్ద నుండి 192 టెట్రా పాకెట్ల 90ఎంఎల్ హైవార్డ్స్ చీర్స్ విస్కీ, 96 టెట్రా పాకెట్ల 180ఎంఎల్ ఓల్డ్ అడ్మిరల్ వీస్ ఒపి బ్రాందీ కర్నాటక టెట్రా పాకెట్స్, మరియు 9-1000ఎంఎల్ ఓల్డ్ అడ్మిరల్ విఎస్ఒపి బ్రాందీ మరియు బజాజ్ కంపెనీ కి చెందిన ఆటొ ని నెంబర్ ఎపి 39 విసి 6429 ను స్వాదీనం చేసుకొని కేసు నమోదు రిమాండ్ నిమిత్తం కదిరి కోర్ట్ కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.