కాటసాని రాంగోపాల్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలి

కాటసాని రాంగోపాల్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలి

    తెదేపా నేత రామాంజనేయులు

న్యూస్ వెలుగు, కల్లూరు : పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం కే. మార్కాపురం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ కి సంబందించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ కల్లూరు మండలం కన్వీనర్
నాయకులు డీ. రామాంజనేయులు కర్నూలు లో అన్నారు. కర్నూలు తెదేపా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కె. మార్కాపురం లో రేషన్ పంపిణీ సరిగా జరగడం లేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం సరికాదని రామాంజనేయులు తెలిపారు. రేషన్ డీలర్ పర్ల మహానంది పార్టీలకు అతీతంగా రేషన్ పంపిణీ చేస్తున్న తప్పడు ఆరోపనలు చేస్తున్నారని అన్నారు. గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉన్నారని ఇలాంటి ఆరోపనలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు వచ్చి తమ గ్రామంలో విచారణ చేపట్టగా రేషన్ పంపిణీ సక్రమంగా జరిగిందని నివేదిక ఇచ్చారన్నారు. ఫింక్షన్ పంపిణీ కూడా ప్రతి నెల ఒకటో తేదీ మార్కాపురం గ్రామంలో అందరి ఇండ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నామని వైసీపీ నాయకుల ఇంటికి సైతం వెళ్తున్నొమని ఆయన ఫోటోలు చూపించారు. తమ గ్రామంపై మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!