
జల క్రీడలకు హబ్ గా కర్నూలు
ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి కెనోయింగ్, కయాకింగ్,డ్రాగన్ బోట్ పోటీలు
కర్నూలు న్యూస్ వెలుగు; రాష్ట్రంలో జిల్లా క్రీడలకు హబ్ గా కర్నూలు నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు లు అన్నారు. శనివారం గార్గేయపురం లోని కర్నూలు సిటీ ఫారెస్ట్ చెరువు నందు రాష్ట్ర స్థాయి 4 వ కెనోయింగ్,కయాకింగ్, డ్రాగన్ బోట్ పోటీలను రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా



విద్యార్థులు చదువుతూ సమానంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే భవిష్యత్తు ఉద్యోగంగా ఉంటుందన్నారు.అనంతరం డీఎస్సీఓ భూపతిరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి చేయూతనందిస్తామన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేస్తే ఫలితాలు సాధించవచ్చు అన్నారు. రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి,జిల్లా ఒలంపిక్ సంఘం సీఈవో విజయకుమార్ లు మాట్లాడుతూ క్రీడాకారులు తాముంచుకున్న క్రీడల్లో సత్తా చాటేందుకు క్రమం తప్పకుండా సాధన చేయాలని సూచించారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించినప్పుడే రాణిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో కెనోయింగ్,కయాకింగ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శివారెడ్డి, ఆంధ్రా ప్రదేశ్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ సెక్రెటరీ మంచికంటి అవినాష్, కర్నూలు జిల్లా వాటర్ స్పోర్ట్స్ కోచ్ చంద్రశేఖర్, జిల్లా స్కేటింగ్ సంఘం సునీల్ కుమార్,జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!