
కేంద్ర నిఘా లోకి కర్నూలు…కీలక సూచనలు చేసిన ఎస్పీ
- నేటి నుంచి కర్నూలులో నో ఫ్లై జోన్
- – ప్రధాని పర్యటన కు 7,500 మంది పోలీసులతో పకడ్బందీ భద్రత
- – ప్రధాని పర్యటన ప్రాంతాలలో 200 సిసి కెమెరాలతో గట్టి నిఘా.
- – డ్రోన్ల ఎగురవేత పై నిషేధం.
కర్నూలు న్యూస్ వెలుగు : నేటి నుంచి అక్టోబర్ 16 వ తేది వరకు కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో నో ఫ్లై జోన్ ఫర్ డ్రోన్స్ గా ప్రకటించామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల గురించి బందోబస్తు నిమిత్తం విచ్చేసిన అడిషనల్ ఎస్పీ స్ధాయి నుండి ఎస్సై స్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడి దిశా నిర్దేశం చేశారు.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు సమీపంలో పసుపుల రోడ్డు లో ఉన్న యు.బి.ఆర్ కన్వేన్షన్ హాల్ లో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు అధికారులకు బ్రీఫింగ్ చేశారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పార్కింగ్ ప్రదేశాలు,బహిరంగ ప్రదేశం, రూట్ డైవర్షన్స్ గురించి వివరిస్తూ జియో గ్రాఫికల్ మ్యాప్ ను చూపిస్తూ అవగాహన కల్పించారు.అడిషనల్ ఎస్పీ స్ధాయి నుండి ఎస్సై ర్యాంకు అధికారులు ఆయా సెక్టార్ ఇంచార్జ్ ఐపియస్ ల దగ్గర విధులు నిర్వహించాలన్నారు. బహిరంగ సభ ప్రదేశం దగ్గర 7 గురు ఎస్పీ స్ధాయి అధికారులను కేటాయించామన్నారు. ప్రధాన మంత్రికి భధ్రత పరంగా అత్యంత భద్రత ఉంటుందన్నారు. ప్రధాన మంత్రి బహిరంగ సభకు దగ్గరగా ఉన్నప్పుడు గాని, బహిరంగ సభ నుండి వచ్చే,వెళ్లే సమయంలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు ఫోటోలు,విడియోలు తీయరాదన్నారు.డిజిపి కంట్రోల్ రూమ్ నుండి సిసి కెమెరాల నిఘా ఉంటుందన్నారు.సుమారు 7,500 మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించామన్నారు. అందరూ బాధ్యతగా పని చేయాలన్నారు.ఎయిర్ పోర్టు దగ్గర , బహిరంగ సభ, పబ్లిక్ గ్యాలరీలు , పార్కింగ్ ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలన్నారు.అనుమానితులు కన్పిస్తే వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.కర్నూలు, నంద్యాల జిల్లాల నుండి 7 వేల బస్సులలో ప్రజలు బహిరంగ సభకు వస్తారన్నారు.ఇందులో 3 వేల బస్సులు ఆర్ టి సి కి చెందినవి ,4 వేల ప్రవేట్ బస్సులలో ప్రజలు ప్రధానమంత్రి బహిరంగ వస్తారన్నారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసేందుకు గట్టి చర్యలు చేపట్టామన్నారు. డ్రోన్ కెమెరాలను ఎవరూ కూడా వినియోగించరాదన్నారు.
ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ సహకరించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో ఆయా జిల్లాల నుండి వచ్చిన ట్రైనీ ఐపియస్ లు , అడిషనల్ ఎస్పీలు , డిఎస్పీలు ,సిఐలు,ఆర్ ఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
