
తహసిల్దార్,డిప్యూటీ తహాసిల్దార్ ను సన్మానించిన నాయకులు
తుగ్గలిన్యూస్ వెలుగు:
తుగ్గలి మండల నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రవి ను,డిప్యూటీ తహాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్ ను మండల సిపిఐ పార్టీ నాయకులు నబి రసూల్,రోల్లపాడు వెంకటేష్ మరియు సిపిఎం పార్టీ నాయకులు శ్రీరాములు,నాయకులు మాభాష,షాషావలి గురువారం రోజున ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ రెడ్డికు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ప్రజలతో కలసి ఆర్డిటి సంస్థను కాపాడాలని వారు ధర్నాను నిర్వహించారు.అదేవిధంగా ఎఫ్సిఆర్ఏ ను వెంటనే రెన్యువల్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!