హైకోర్టు బెంచ్ ప్రకటనతో హర్షం వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్ నాయకులు

హైకోర్టు బెంచ్ ప్రకటనతో హర్షం వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్ నాయకులు

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదుల సఃఘం నాయకులు స్వాగతించారు. గత వైసీపీ ప్రభుత్వం కర్నూలు లో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ హామీ మేరకు కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి బుధవారం మంత్రి మండలి తీర్మానం చేయడంతో కర్నూలు న్యాయవాదులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు బెంచ్ కర్నూలు లో ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి కి ఎంతగానో దోహదపడుతుందన్నారు.ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి.రవి కాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు.క్రిష్ణమూర్తి,రాష్ట్ర బార్ అసోసియేషన్ నాయకులు.రవి, జహంగీర్. న్యాయవాది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!