పార్టీ బలోపేతానికి కృషిచేద్దాం : మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు

పార్టీ బలోపేతానికి కృషిచేద్దాం : మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు

న్యూస్ వెలుగు కర్నూలు : కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ డిసిసి అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు  సుధాకర్ బాబు  అధ్యక్షతన జరిగిన కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పార్టీ బలోపేతం కోసం పలు సూచనలు చేసినదని అందులో భాగంగా బుధవారం  కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ సమావేశమై పలు విషయాలు చర్చింమన్నారు .

కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కర్నూలు జిల్లా నాయకులకే ఇవ్వాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారనీ సుధాకర్ బాబు తెలియ జేశారు. త్వరలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులు   వైఎస్ షర్మిలా రెడ్డి కలిసి కర్నూలు జిల్లా కాంగ్రెస్ సమస్యలు తెలియజేస్తామని సుధాకర్ బాబు తెలియ చేశారు. సమావేశము అనంతరం కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ చేతులు కలిపి  వైఎస్ షర్మిల  నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, నియోజక వర్గాల కోఆర్డినేటర్లు ఎమ్మిగనూరు ఏం కాశీంవలి, పత్తికొండ బి క్రాంతి నాయుడు, ఆదోని రమేష్ యాదవ్, కోడుమూరు అనంతరత్నం మాదిగ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి మహేంద్ర నాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సి బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, కేకేసి సెల్ జిల్లా చైర్మన్ ఎజాస్ అహ్మద్, ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రెటరీ వై మారుతీ రావు, కిసాన్ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు పోతుల శేఖర్, డిసిసి మాజీ ఉపాధ్యక్షులు రియాజుద్దీన్, సయ్యద్ నవీద్, దిలీప్ ధోక, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కే రాఘవేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నూర్, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎంలూరి లాజరస్, జిల్లా మహిళా కాంగ్రెస్ ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, కాంగ్రెస్ నాయకులు షేక్ మాలిక్, డబ్ల్యూ సత్యరాజు, అబ్దుల్ హై, శ్రీనిద్ రాయల్, దేవనకొండ డాక్టర్ వెంకప్ప, రామకృష్ణారెడ్డి, సాయినాథ్, జాన్ సదానందం, ఐ ఎన్ టి యు సి ఎన్ సుంకన్న, ఆర్ ప్రతాప్, కే రవి మొదలగు వారు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!