అందరి సహకారం అవసరం లోక్‌సభ స్పీకర్

అందరి సహకారం అవసరం లోక్‌సభ స్పీకర్

న్యూస్ వెలుగు ఢిల్లీ :  వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల ఆకాంక్షలు ,  జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు సభ్యులందరి సమిష్టి పాత్ర ముఖ్యమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు మరియు సభ్యులు సహకరించాలని బిర్లా ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో కోరారు. నిర్మాణాత్మక చర్చలు మరియు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంభాషణలు జరగాలని ఆయన కోరారు.  ఈ వర్షాకాల సమావేశాలు  విజయవంతంగా జరుగుతాయని రాజ్యాంగ విలువలను మరింత బలోపేతం చేయడానికి అందరి  సహకారాన్ని అందిస్తారని  బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS