మధుశేఖర్ కు వైవీయూ డాక్టరేట్ ప్రదానం

మధుశేఖర్ కు వైవీయూ డాక్టరేట్ ప్రదానం

కడప, న్యూస్ నేడు: యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర మరియు పురాతత్వ శాఖ పరిశోధకుడు ఎం. మధుశేఖర్ కు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రకటించింది. విశ్వవిద్యాలయం చరిత్ర మరియు పురాతత్వ శాఖ ఆచార్యులు జి. సాంబశివ రెడ్డి పర్యవేక్షణలో “గ్రోత్ ఆఫ్ ప్రెస్ అండ్ నేషనలిజం ఇన్ కలోనియల్ కర్నూలు డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ A.D. 1858 – 1947 : ఎ స్టడీ” అనే అంశం పైన పరిశోధన చేసి రూపొందించిన సిద్ధాంత గ్రంధాన్ని మధుశేఖర్ విశ్వవిద్యాలయ పరీక్షలు విభాగానికి సమర్పించారు. వైవీయూ ఉపకులపతి ఆచార్యులు అల్లం శ్రీనివాస రావు మార్గదర్శకత్వంలో నియమితులైన నిపుణుల బృందం పరిశోధకుడు మధుశేఖర్ రూపొందించిన పరిశోధన గ్రంథం అధ్యయనం చేసి డాక్టరేటు అర్హత ఉందంటూ ధృవీకరించారు. ఈ మేరకు మధుశేఖర్ కు డాక్టరేట్ ప్రొసీడింగ్స్ ను వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి కృష్ణా రావు జారీ చేశారు. ఈయన రచించిన పరిశోధక పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా మాధుశేఖర్ ను వైవీయూ ఉపకులపతి అల్లం శ్రీనివాస రావు, కులసచివుల ఆచార్య పి. పద్మ, ప్రధాన ఆచార్యులు టి. శ్రీనివాస్ మరియు చరిత్ర మరియు పురాతత్వ శాఖ సహ ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు అభినందించారు. ఎం.ఏ బీఈడీ, యూజీసి నెట్, ఏపీసెట్, టిఎస్సెట్, ఏపీఆర్సెట్ పరీక్షలలో అర్హత సాధించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!