కూటమి ప్రభుత్వంతో గ్రామాలకు మహర్దశ ; అప్పా వేణు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంతో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఉప్పర్లపల్లె గ్రామ టిడిపి నాయకులు అప్పా వేణు తెలియజేశారు.ఆదివారం రోజున పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యాంబాబు చొరవతో ఉప్పర్లపల్లి గ్రామం నందు హరిజనవాడలో వేస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను గ్రామ టిడిపి నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామ టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణాలను చేపట్టడం సంతోషకరమని వారు తెలియజేశారు.కూటమి ప్రభుత్వం ద్వారా గ్రామాల రూప రేఖలు మారిపోతాయని వారు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే చొరవతో గ్రామంలో గల మినరల్ వాటర్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభిస్తామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నీలా ప్రసాద్,నీలా మనోహర్,మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, పోస్ట్ వెంకటేష్,ఈశ్వరయ్య,టైలర్ కంబగిరి,ఫీల్డ్ అసిస్టెంట్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.