
ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు
ధర్మకర్త అప్పా వేణు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని గల ఉప్పర్ల గ్రామ సమీపంలోని గల బోడబండ పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ పకీరప్ప గురు స్వాములు,శ్రీ యల్లప్ప గురుస్వాములు మరియు శ్రీ ఆంజనేయులు తాత వారి మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు బుధవారం నుండి ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్త అప్పా వేణు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదీ బుధవారము ఉదయం శ్రీ అప్పా చంద్రశేఖర్ గారి ఇంటి నుండి స్వామి వారి ఆభరణములు శ్రీ పక్కీరప్ప స్వామి దేవస్థానమునకు చేరుతాయని, బుధవారము సాయంత్రం శ్రీ బోడబండ పక్కిరప్ప స్వామి,శ్రీ యల్లప్ప స్వామి గారి ఉత్సవమూర్తులు అప్పా
సంజీవులు,అప్పా రవి,అప్పా లక్ష్మీ నారాయణ గార్ల ఆధ్వర్యమున అప్పా వెంకటరాముని ఇంటి నుండి ఊరేగింపు జరిగినపిమ్మట బోడబండ దేవస్థానమునకు చేరుతాయని
తెలియజేశారు.గురువారము ఉదయం 8 గంటలకు శ్రీ పక్కీరప్ప స్వామి,శ్రీ యల్లప్ప స్వామి,శ్రీ ఆంజనేయులు తాత ఉత్సవమూర్తులు అప్పా నారాయణ స్వామి ఆధ్వర్యమున గంగా స్నానం నిర్వహిస్తారని,అనంతరం 11 గంలకు నుండి పెరవలి గ్రామము గవ్వల గురునాథము,మొగలగవెల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ రంగన్న తాత,శ్రీ పక్కీరప్ప తాత భక్తాదులు మరియు హైదరాబాద్ శ్రీరాములు గార్లచేత ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమము జరుగునని, గురువారం సాయంత్రం 5-00 గం.లకు శ్రీ పక్కీరప్ప స్వామి,శ్రీ యల్లప్ప స్వామి శ్రీ ఆంజనేయులు తాత గార్ల రథోత్సవము శ్రీ అప్పా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతుందని వారు తెలియజేశారు. 28వ తేదీ శుక్రవారము శ్రీ స్వామి వారి హుండి అప్పా వేణు (ధర్మకర్త),అప్పా నారాయణ స్వామి,అప్పా సత్యన్న, అప్పా వెంకట రాముడు,అప్పా వెంకటేశ్,అప్పా సురేష్ గార్ల ఆధ్వర్యంలో లెక్కించబడునని ఆలయ ధర్మకర్త అప్పా వేణు తెలియజేశారు. మహాశివరాత్రి వేడుకలకు భక్తాదులందరు విచ్చేసి శివరాత్రి వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్త అప్పా వేణు తెలియజేశారు.అదేవిధంగా చెన్నంపల్లి గ్రామం నందు శివరాత్రి పర్వదినాన చెన్నంపల్లి సాగునీటి సంఘం అధ్యక్షులు సప్లయర్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు.అదేవిధంగా సాయంకాలం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు.

