మహబూబ్ బాషా మృతి జర్నలిజానికి తీరనిలోటు

మహబూబ్ బాషా మృతి జర్నలిజానికి తీరనిలోటు

బి.చిన్న రామాంజనేయులు, కార్యదర్శి

ఎన్.సత్యనారాయణ,అధ్యక్షులు

న్యూస్ వెలుగు కర్నూలు; నంద్యాల జిల్లా,గడివేముల మండలం, తెలుగుప్రభ పత్రికలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ మహబూబ్ బాషా ఆకస్మిక మృతి జర్నలిజానికి తీరనిలోటు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు నీలం సత్యనారాయణ,బి.చిన్న రామాంజనేయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.సోమవారం మహబూబ్ బాషా మృతి సందర్బంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం,సమాచార శాఖభవన్ వద్ద యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో సంతాపసభ ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా మహబూబ్ బాషా చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం అధ్యక్ష,కార్యదర్శులు నీలం సత్యనారాయణ,బి.చిన్న రామాంజనేయులు మాట్లాడుతూ మహబూబ్ బాషా పలు సంస్థల్లో పాత్రికేయుడిగా పనిచేసినట్లు చెప్పారు. మండలంలోని ప్రజల సమస్యలు పరిష్కారం కోసం,అలాగే జర్నలిస్ట్ సంఘం ద్వారా జర్నలిస్ట్ ల హక్కుల సాధనకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.మహబూబ్ బాషకు కుమారుడు,కుమార్తె ఉన్నట్లు చెప్పారు.కావున అతని కుటుంబానికి ప్రభుత్వ పథకాలను న్యాయంగా అందించి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.
భవిష్యత్ లో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో మహబూబ్ బాషా ఆశయసాధనకు ముందుకెళతామని అన్నారు.అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్ట్ లు తమ హక్కుల సాధనకు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ కమిటీ బృందం వి.విజయ్ కుమార్,ఎం.ఆర్. వి.కరణ్,లక్ష్మన్న,ఎం.లోకేష్,యు.రాజశేఖర్,జి.శేఖర్,వై.వి.రెడ్డి,ఎస్.ఎం.డి.అసిఫ్,కిషోర్,వి.జనార్దన్,ఎన్.కె.మధు,డి.సంజీవయ్య, పి.నాగేంద్రుడు,వి.వెంకటస్వామి, పాత్రికేయులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!