
వక్ఫ్ సవరణ బిల్లు పై సూచనలు చేయండి : JPC
ఢిల్లీ : వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024పై పార్లమెంటు సంయుక్త కమిటీ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, సంస్థల నుండి అభిప్రాయాలు , సూచనలను ఆహ్వానించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కమిటీకి వ్రాతపూర్వక సూచనలను సమర్పించాలనుకునే వారు రెండు కాపీలను ఇంగ్లీషులో లేదా హిందీలో జాయింట్ సెక్రటరీ (JM), లోక్‌సభ సెక్రటేరియట్, రూమ్ నెం. 440, పార్లమెంట్ హౌస్ అనెక్స్, న్యూఢిల్లీ- 110001కి పంపవచ్చని తెలిపింది. లేద ఇమెయిల్ కూడా పంపవచ్చని ప్రకటనలో పేర్కొంది. jpcwaqf-lss@sansad.nic.in . ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 15 రోజులలోపు సూచనలు చేరుకోవాలని వెల్లడించింది. అయితే ఈ విషయంలో కమిటీ నిర్ణయమే అంతిమంగా ఉంటుందని పేర్కొంది.
‘వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024’ యొక్క పూర్తి సమాచారాన్ని లోక్‌సభ వెబ్‌సైట్‌లో హిందీ మరియు ఆంగ్లంలో అందుబాటులో ఉందని తెలిపింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు, లోక్‌సభ ఎంపీ జగదాంబికా పాల్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపబడిందని వెల్లడించింది. ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి వారం చివరి రోజులోగా ఈ కమిటీ బిల్లును సభకు నివేదించాల్సి ఉందగ ప్రకటనలో పేర్కొంది.