అడ్డ పల్లకి మహోత్సవాన్ని దిగ్విజయం చేయండి

అడ్డ పల్లకి మహోత్సవాన్ని దిగ్విజయం చేయండి

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో కాశీ జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవం,సంగీతయుత ఇష్టలింగ పూజ,ఎల్లార్తి గ్రామంలో శ్రీ శైల జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవ కార్యక్రమాలను భక్తులు కలిసి కట్టుగా దిగ్విజయం చేయాలని కల్లుహోలే మఠం పాల్తూరు శ్రీ చన్నవీర శివచార్యులు,పురవర్గ మఠం జంగమర హోసల్లి శ్రీ అజాత శంభులింగ శివచార్యులు భక్తులకు పిలుపునిచ్చారు.గురువారం మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో భక్తులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శివచార్యులు మాట్లాడుతూ ఏప్రిల్ 2న ఎల్లార్థి గ్రామంలో సజ్జల గుడ్డ శరణమ్మ అవ్వ పురాణ ప్రవచన కార్యక్రమం ముగింపు సందర్భంగా శ్రీ శైల జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.అలాగే మండల కేంద్రంలో ఏప్రిల్ 17వ తేదిన కాశీ జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవం,18వ తేదిన ఇష్ట లింగ పూజా కార్యక్రమం ఉంటుందని కావున భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కలిసి కట్టుగా కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించి దిగ్విజయం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ,శివ శంకర్ గౌడ,సిద్దార్థ్ గౌడ,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Was this helpful?

Thanks for your feedback!