గువపట్నం కాలనీలో మమ్మురంగా టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బిర్రు గుర్రప్ప అలియాస్ సంతోష్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భూపేష్ రెడ్డి ఆదేశాల మేరకు దిగువపట్నం కాలనీలో 14, 15 వ వార్డులో టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బిర్రు గుర్రప్ప అలియాస్ సంతోష్ ఆధ్వర్యంలో టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు సభ్యత నమోదులో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని, అలాగే సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దిగువపట్నం కాలనీ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!