నీటి సమస్యను పరిష్కరించిన మారెళ్ల సర్పంచ్ సుగుణమ్మ
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని మారెల్ల గ్రామంలో గత రెండు వారాలుగా నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించినట్లు మారేళ్ళ గ్రామ సర్పంచ్ సుగుణమ్మ, సర్పంచ్ సలహాదారులు సుధాకర్ రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా మారేళ్ల గ్రామ సర్పంచ్ సలహాదారులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న త్రాగునీటి బోరు గత రెండు వారాలుగా చెడిపోవడంతో బోరులోని పైపులను యంత్రం ద్వారా పెకిలించి,బోరులో ఉన్న పైపులు పూర్తిగా దెబ్బ తినడంతో,కొత్త పైపులను వేయించడం జరిగిందని సలహాదారుడు సుధాకర్ రెడ్డి తెలియజేశారు.ఇకపై గ్రామ ప్రజలకు త్రాగు నీటి కష్టాలు ఉండవని, యధావిధిగా త్రాగు నీటి బోరు పనిచేస్తుందని మారెల్లా గ్రామ సర్పంచ్ సలహాదారులు సుధాకర్ రెడ్డి తెలియజేశారు.తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!