
మేలన్న మరణం తీరని విషాదాన్ని నింపింది
ఆదోని న్యూస్ వెలుగు : జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో 108వ రిలే నిరాహార దీక్ష, ఆదోని జిల్లా సాధనలో భాగస్వామ్యం అయిన గాయకుడు మరణించడం తో ఆయన కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు జాయింట్ యాక్షన్ సభ్యులు తెలిపారు. ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలైన ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని కలుపుకుని ఆదోని ని జిల్లాగా ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు.
ఆదోని జిల్లా ఉద్యమాన్ని తన యొక్క గానంతో ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకుని వచ్చిన గాయకుడు మేలన్న, గుండెపోటు మరణం విషాదాన్ని మిగిల్చిందన్నారు. కాబట్టి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహిస్తూ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 108వ నిరాహార దీక్షలు బూదెప్ప, రామాంజనేయులు, పిఎస్ వీరేష్, కుమార్ వైయస్సార్ నగర్, వీరేష్ దత్తు, తదితరులు దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు.

