గజ్జెహళ్ళి పాఠశాలలో ఎంఈవో ఆకస్మిక తనిఖీ
హొళగుంద,న్యూస్ వెలుగు; మండలం పరిధిలోని గజ్జెహళ్లి గ్రామ ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ సత్యనారాయణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని రికార్డులను,రిజిస్టర్ లను పరిశీలించారు. అలాగే విద్యార్థుల నోటు పుస్తకాలను పరిశీలించారు. పాఠశాలల సమస్యలపై ఆరా తీశారు. రెగ్యులర్ గా క్లాసులు జరుగుతున్నాయా లేదా ఆహారం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యమిస్తుంది అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులు హాజరు సబ్జెక్టు వారిగా పాఠాలు పూర్తి వంటి వివరాలు పాఠశాలలో రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు తెలియజేశామన్నారు. ఎంపీపీ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్కూల్ చైర్మన్ అనిల్ స్వామికి తెలియజేశారు.స్కూల్ యాజమాన్యంపై అలాగే విద్యార్థుల మరుగుదొడ్లు ప్రత్యేక దృష్టి చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్కూల్ హెచ్ఎం శ్రావణి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బిజెపి జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రెటరీ సి.రామలింగ ఎంపీపీ స్కూల్ చైర్మన్ అనిల్ స్వామి పాల్గొన్నారు.