
ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్ల తో సమావేశం నిర్వహించిన మంత్రి
విశాఖ (న్యూస్ వెలుగు ) : ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో మంత్రి నారలోకేష్ ప్రత్యేకంగా సమావేశం అయ్యాను. విశాఖపట్నం, అనకాపల్లి, విజయగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన రీజియన్ అభివృద్ధి, ఇతర అంశాలపై సమీక్షించారు . రాబోయే కాలంలో విశాఖ రీజియన్ లో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఇందుకు కావాల్సిన మౌలిక వసతులపై నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు . బెంగళూరు, పుణెలాంటి నగరాల్లో ఉండే ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ రీజియన్ లో ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు అనువైన ల్యాండ్ బ్యాంకులను సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్య సూచనలు చేశారు .

Was this helpful?
Thanks for your feedback!