
పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన మంత్రి
న్యూస్ వెలుగు తెలంగాణ: హైదరాబాద్ గాంధీ భవన్‌లో బుదవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, పరిశ్రమలు, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి , అనీల్ కుమార్ యాదవ్ ఎంపీ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు, సీనియర్ నేతలు, యువజన నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం, సమీకరణాలు, విభిన్న సామాజిక వర్గాల చేర్పు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగిందని మంత్రి వెంకటస్వామి తెలిపారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే రాజకీయ కార్యాచరణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని పార్టీ నిర్మాణాన్ని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ స్థాయిలో సమన్వయంతో పని చేయాలని ఈ సమావేశంలో నేతలకు సూచించారు.