
లండన్ లో పర్యటనలో మంత్రినారా లోకేష్
న్యూస్ వెలుగు మంగళగిరి : రాష్ట్రఐటీ, విద్యా శాఖల మంత్రినారా లోకేష్ లండన్ లో పర్యటిస్తున్నారు. నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న CII పార్టనర్షిప్ సమ్మిట్ – 2025 సన్నాహాల్లో భాగంగా రాష్టంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాల గురించి అక్కడి పారిశ్రామికవేత్తలకు తెలియచేసేందుకు మంత్రినారా లోకేష్ లండన్ పర్యటన దోహదపడనుందని అధికారులు పేర్కొన్నారు. లండన్ పాల్ మాల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వేదికగా జరిగేకార్యక్రమంలో
మంత్రినారా లోకేష్ పపంచ వ్యాపార దిగ్గజాలతో చర్చిస్తారని అధికారులు తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!