ప్రజా వినతులను స్వీకరించిన మంత్రి నారాలోకేష్

ప్రజా వినతులను స్వీకరించిన మంత్రి నారాలోకేష్

విశాఖ న్యూస్ వెలుగు : విశాఖ టీడీపీ కార్యాలయంలో 60వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నారాలోకేష్ పాల్గొన్నారు. సామాన్య ప్రజానీకం నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు కోరారు. ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, బ్రెడ్ విన్నర్ స్కీమ్ ను అమలుచేసి తమకు న్యాయం చేయాలని విశాఖకు చెందిన కే.రమాదేవి విన్నవించారు. విశాఖ పెందుర్తి నియోజకవర్గం వేపగుంట జెడ్ పీహెచ్ స్కూల్ వెనుక కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలని రేపర్తి రాజు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.  ఆయా అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి  హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS