పత్తికొండ/తుగ్గలి న్యూస్ వెలుగు:

నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యాంబాబు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం రోజున పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 28 మంది లబ్ధిదారులకు గాను 24 లక్షల 19వేల రూపాయల విలువ గల చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. పత్తికొండ నియోజకవర్గం నందు ఏడాది పాలనలో 98 లక్షల 50 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం లబ్ధిదారుల అందజేసినట్లు ఆయన తెలిపారు . రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేద ప్రజల కుటుంబంలో పెద్ద కొడుకుల నిలుస్తూ వారికి ఆర్థికంగా భరోసానిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నైపుణ్యతతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతూ, ప్రజలకు సంక్షేమ పాలనను ముఖ్యమంత్రి అందిస్తున్నాడని ఆయన కొనియాడారు .ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటి నెరవేరుస్తుందన్నరు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు,రాతన మనోహర్ చౌదరి, తుగ్గలి మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Thanks for your feedback!