సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు

పత్తికొండ/తుగ్గలి వెలుగు న్యూస్ ప్రతినిధి: నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు శనివారం రోజున బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పత్తికొండ నియోజకవర్గంలోని సుమారు 20 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 29 లక్షల 44,649 రూపాయలు మంజూరైంది.అందుకు సంబంధించిన చెక్కులను పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు స్థానిక టీడీపీ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.ఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ కష్టకాలంలో కుటుంబానికి పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని,పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు,ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.తుగ్గలి మండలం తుగ్గలి గ్రామానికి చెందిన ఎరుకల జయమ్మ వారి కుటుంబానికి 54,838 రూపాయలు,తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన శ్యామల గడూరు లక్ష్మన్న కు 155339 రూపాయలు,
తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన ఎంకే గౌతమి కు 189019 రూపాయలు,తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన కారం నరేష్ రెడ్డి కు 279166 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కే.ఈ శాంబాబు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,పెరవలి పురుషోత్తం చౌదరి, బత్తిన లోకనాథ్,రాతన కృష్ణమూర్తి చౌదరి,రాతన మైరాముడు తదితర టిడిపి నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!