
రైతులకు సబ్సిడీ పప్పు శనగలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు
మద్దికేర న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన మద్దికేర గ్రామంలోని రైతు సేవా కేంద్రం యందు రైతులకు సబ్సిడీ పప్పు శనగలను గురువారం రోజున పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యాంబాబు రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే రైతులకు సబ్సిడీతో కూడిన సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన తెలియజేశారు. 2024 రబీ సీజన్ కు సంబంధించి 25 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పప్పు శనగలను అందజేస్తుందని ఆయన తెలియజేశారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ ప్రజలకు అమలు చేస్తామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గూడూరు ధనుంజయుడు,పురుషోత్తం చౌదరి, రాజన్న యాదవ్,మండల వ్యవసాయ అధికారి రవి,వ్యవసాయ విస్తరణ అధికారి భోజరాజు,వ్యవసాయ సహాయకులు జాకీర్,మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!